రొమాంటిక్ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్ ..!!

ఆకాష్ పూరి హీరోగా, కేతిక శర్మ హీరోయిన్లు కలిసి నటించిన తాజా చిత్రం రొమాంటిక్. ఈ సినిమాని అనిల్ పాడు దర్శకత్వంలో తెరకెక్కిచడం జరిగింది. ఇక ఈ సినిమాకు మాత్రం కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్ని పూరి జగన్నాథ్ అందించడం విశేషం. ఈ చిత్రం అక్టోబర్ 20వ తేదిన విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇప్పటికి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ను చిత్రయూనిట్ చాలా శరవేగంగా చేస్తున్నారు.


ఇక ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ తాజాగా విడుదల అయింది. ఇక ఈ చిత్ర ట్రైలర్ ని హీరో ప్రభాస్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే ఈ సినిమాలో రొమాన్స్ తో పాటు, యాక్షన్ సీన్లు, సస్పెన్స్ సీన్లు, డైలాగ్స్ అన్ని ట్రైలర్ లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమాకి ముఖ్యంగా హీరోయిన్ అందాలు ప్లస్ కానున్నట్లుగా కనిపిస్తున్నది. ఎట్టకేలకు పూరి ఆకాశ్ ఈ సినిమాతో హిట్ సాధిస్తాడెమో వేచి చూడాల్సిందే.

Share post:

Popular