నీ జీవితానికి నువ్వే ఎజమాని.. రష్మిక మందన?

ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పరిచయం అయినా రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా ఉంది ఈ కన్నడ బ్యూటీ.గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో రష్మిక చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మనలోని ప్రతిభను మనం గుర్తించగలిగితే జీవితంలో మరింత ముందుకు వెళ్లవచ్చు అంటున్నారు హీరోయిన్‌ రష్మికా మందన్నా. ఈ విషయం గురించి ఆమె సోషల్‌ మీడియా వేదికగా వరుస ట్వీట్స్‌ చేశారు. ఒక మనిషిగా మనం లోపాలతో జన్మించి ఉండవచ్చు. అభద్రతాభావాల మధ్య జీవిస్తూ ఉండొచ్చు.

కానీ ప్రపంచం నువ్వు ఏం చేయగలవని అనుకుంటుందో దానికన్నా ఎక్కువగానే నువ్వు సాధించగలవని తెలుసుకునే సమయం వస్తుంది అని తెలిపింది.అదే విధంగా నీలోని ఆ ప్రతిభను నువ్వు గుర్తించిన రోజు నువ్వు బలమైన, తెలివైన వ్యక్తి అయిపోతావు. నిన్ను ఆపేవారు ఎవరూ ఉండరు.ఇలాంటప్పుడు నీ జీవితంలో ఇతరుల ఆధిపత్యం ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నీ శక్తి నీదే.మీ జీవితానికి, మనసుకు, భావోద్వేగాలకు మీరే యజమాని. మీ జీవితంలోని విలువైన వారి కోసమే వీటిని కేటాయించండి. అలాగే వారిని ఎంచుకోవడంలో తెలివిగా వ్యవహరించండి’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా.

Share post:

Popular