రాజీవ్ కనకాల గురించి చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్న సుమా..?

ఇటీవల రాజీవ్ కనకాల నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ లవ్ స్టోరీ.. ఇక ఈ సినిమా కోసం రాజీవ్ కనకాల ఎంత కష్టపడ్డారో మనకు ఇటీవల లవ్ స్టోరీ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి యాంకర్ సుమ కూడా రాజీవ్ పడిన కష్టాల గురించి చెప్పుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు..

సెప్టెంబర్ 24వ తేదీన విడుదలైన లవ్ స్టోరీ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.. అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కలెక్షన్ల పరంగా బాగానే సాధిస్తోందని చెప్పవచ్చు.. ఈ రోజు విడుదలైన రిపబ్లిక్ సినిమా పాజిటివ్ టాక్ రాకపోవడంతో లవ్ స్టోరీ సినిమా మరో వారం రోజుల పాటు బాగానే కలెక్షన్లు సాధిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. రాజీవ్ కనకాల పాత్ర గురించి ప్రేక్షకుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా యాంకర్ సుమ మాట్లాడుతూ ..కొంతమంది నటులు మాత్రమే తమ నటనతో మనుషులను తాకుతారు.. అలాంటి నటులలో నా భర్త రాజీవ్ కూడా ఒకరు.. లవ్ స్టోరీ సినిమాలో తన పాత్ర చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు.. అంత ఇబ్బంది పడ్డాడు కాబట్టి ఈ రోజు తన పాత్ర ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నాడు.. రాజీవ్ పడ్డ కష్టం ఎంత ఉందో నాకు మాత్రమే తెలుసు అంటూ ఆమె కన్నీటి పర్యంతమైంది.. అంతేకాదు రాజీవ్ ఇలాంటి పాత్రలు చేయడం తనకు గర్వంగా ఉంది అంటూ కూడా ఆమె వెల్లడించింది. ఇక లవ్ స్టోరీ సినిమా టీంకు శుభాభినందనలు తెలిపింది సుమా.