రాదే శ్యామ్ నుంచి మరొక అప్డేట్.. స్టైలిష్ లుక్ లో ప్రభాస్..!

మరొక రెండు రోజుల ప్రభాస్ పుట్టిన రోజు ఉండడంతో సోషల్ మీడియా లో ఫ్యాన్స్ సందడి మొదలు పెట్టేశారు. తాజాగా ఇప్పటికే డార్లింగ్ అభిమానులు ట్విట్టర్లో ప్రభాస్ బర్తడే అని హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలోనే ప్రభాస్ బర్త్ డే కానుకగా ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ మూవీమేకర్స్ రెడీ అయ్యారు.

తాజాగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాదే శ్యామ్. సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు గా అధికారికంగా ప్రకటించారు. అయితే అక్టోబర్ 23న ఉదయం విక్రమాదిత్య ఎవరని విషయాన్ని తెలియజేస్తామని తెలియజేశారు. అయితే అంత కంటే ముందుగా చిత్ర బృందం నుంచి అభిమానుల కోసం ఒక సర్ప్రైజ్ ఇచ్చింది.

ప్రభాస్ కు సంబంధించి ఒక ఎక్స్ క్లూజివ్ ఈ పోస్టర్ ని దర్శకుడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించడం వల్ల అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. దీంతో ప్రభాస్ లుక్ పై ట్రోల్ చేసిన వారందరూ నోరు ముగించేలా ఉన్నాడు.

Share post:

Latest