కన్నడ సినీ ఇండస్ట్రీకి ఏ శాపం తగిలిందో.. వరుసబెట్టి చనిపోతున్న స్టార్ హీరోలు..!

ఒకప్పుడు సౌత్ లో సినీ ఇండస్ట్రీ అంటే తెలుగు, తమిళ ఇండస్ట్రీలే. శాండల్ వుడ్ గా పేరు తెచ్చుకున్న కన్నడ సినీ ఇండస్ట్రీ రేంజ్ తక్కువగానే ఉండేది. అయితే గత 20 ఏళ్లలో కన్నడ సినీ ఇండస్ట్రీ రేంజ్ పెరిగింది. ఒకప్పుడు అక్కడ చిన్న సినిమాలు మాత్రమే నిర్మితమయ్యేవి. కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉండేవి. అక్కడ తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో ఎక్కువగా ఆడేవి.

- Advertisement -

ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా స్థాయి సినిమాలు కూడా అక్కడ నిర్మితమవుతున్నాయి.
దీనికి కారణం ఇప్పుడు అక్కడ స్టార్ హీరోలు గా రాణిస్తున్న వారి కృషే. అయితే ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటం అక్కడి సినీ ఇండస్ట్రీని, అభిమానులను బాధిస్తోంది. కన్నడ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుని నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న పునీత్ రాజ్ కుమార్ మృతి కన్నడ చిత్ర సీమకు పెద్ద దెబ్బ తగిలినట్లయింది.

అలాగే రెండేళ్ల కిందట మరో కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జా 39 ఏళ్లకే గుండెపోటుతో చనిపోయాడు. అలాగే ఈ ఏడాది జూన్లో యువ హీరో సంచారి విజయ్ కూడా ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇలా వరుసబెట్టి కన్నడ చిత్ర సీమకు చెందిన అగ్ర హీరోలు మృతి చెందుతుండటం కలచివేస్తోంది.

ఇప్పుడే కాదు గతంలోనూ కన్నడ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు గా వెలుగుతున్న వారు కన్నుమూశారు. కన్నడ మెగాస్టార్ గుర్తింపు పొందిన విష్ణువర్ధన్ 58 ఏళ్లకు, యాక్షన్ హీరోగా గుర్తింపు పొందిన శంకర్ నాగ్ నాగు 35 ఏళ్ళకే చనిపోయారు. తెలుగులో సావిత్రి తర్వాత అంత స్థాయిలో గుర్తింపు పొందిన సౌందర్య, తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో పేరు తెచ్చుకున్న యశో సాగర్ కూడా కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ కూడా అర్ధంతరంగా కన్నుమూశారు.

Share post:

Popular