పూజా హెగ్డే బర్త్ డే రోజున ఆచార్య సినిమా నుంచి బిగ్ అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ప్రస్తుత చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండడం విశేషం. రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే కూడా నటిస్తోంది. ఇక ఈ సినిమా పై తన అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక తండ్రి కొడుకులు గా కలిసి పూర్తి సినిమాలో నటించడం ఇదే మొదటిసారి.

అయితే ఈ సినిమా నుంచి అక్టోబర్ 13వ తేదీన రామ్ చరణ్కు జోడీగా నటిస్తున్న పూజాహెగ్డే బర్తడే కదా ఆ రోజు ఈ సినిమా నుంచి నీలాంబరి అనే పాటను విడుదల చేయండి అంటూ మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందం యూనిట్ ను కోరుతున్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి కోరారు కాబట్టి పూజా హెగ్డే బర్త్ డే కానుకగా అక్టోబర్ 13వ తేదీన తప్పకుండా ఈ సినిమా నుంచి నీలాంబరి అనే పాట రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది .

Share post:

Latest