ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచినా 11 మంది రిజైన్..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలతో ఒక్కసారిగా సంచలనం చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు మా కు రాజీనామా చేశారు. అంతేకాకుండా ఆయనకు మద్దతుగా కొందరు సినీ పెద్దలు కూడా ఉండటం విశేషం. మంచు విష్ణు కి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదనే తమ ప్యానల్ సభ్యులు రాజీనామా చేసినట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. దీంతో పాతికేళ్లకు పైగా ప్రస్థానం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిలువునా చీలిపోయింది.

ఈసారి జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానల్ నుంచి కొందరు, అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి కొందరు గెలవడం జరిగింది. మళ్లీ మా లో మాకు భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది, భజన్ గా ప్రశ్నించే వ్యక్తిత్వం ఉన్న మేము అడగకుండా ఉండలేము, అందువల్ల మా సంస్థని విష్ణు ప్యానల్ వ్యక్తులే నడిపితే మా సభ్యులకు జరగవచ్చు అనే ఆశతో ఉద్దేశంతో మేము మా పదవులకు మనసా వాచా కర్మణా రిజైన్ చేస్తున్నాం. మిమ్మల్ని గెలిపించిన సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. వల్ల భవిష్యత్తులో మా లో ఏ అభివృద్ధి జరక్కపోయినా సంక్షేమ కార్యక్రమాలు జరగకపోయినా ప్రశ్నిస్తూఉంటాం ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటించింది.