బిగ్ న్యూస్‌..`అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్‌తో ప్ర‌భాస్ 25వ సినిమా..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` మ‌రియు నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్‌-కె` చిత్రాలు చేస్తున్నాడు.

Rebel Star Prabhas to get married in 2020? Here is what his aunt Shyamala Devi has to say | Telugu Movie News - Times of India

అయితే ఈ చిత్రాల‌న్నీ పూర్తి కాకుండానే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రంపై అక్టోబ‌ర్ 7న అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందంటూ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. దాంతో ప్ర‌భాస్ ఈ సారి ఏ డైరెక్ట‌ర్‌కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడా అని అభిమానులు ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

Sandeep Reddy Vanga's Next Titled 'Devil'

అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ప్ర‌భాస్ 25వ సినిమాను సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల తర్వాత మరో సినిమా చేయ‌ని సందీప్.. ఇటీవ‌ల ఓ డిఫరెంట్ స్టోరీతో ప్రభాస్ వ‌ద్ద‌కు వెళ్లి వినిపించాడ‌ట‌. దానికి ఇంప్రెస్ అయిన ప్ర‌భాస్‌..వెంట‌నే మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఇక వీరి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని టీ-సిరీస్ నిర్మించ‌బోతోంది.

Share post:

Latest