పూజ హెగ్డే పేరు వెనకాల అసలు కథ ఇదే..?

 ప్రస్తుతం టాలీవుడ్ లో , బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదుగుతున్న హీరోయిన్ పూజా హెగ్డే. ఇక ఈ మధ్య కాలంలో టాలీవుడ్లోని హీరోలు కూడా ఈమె కావాలని పట్టు పడుతున్నారట. ఇక అభిమానులు కూడా పూజా హెగ్డే తో కలిసి నటిస్తే హిట్ సినిమా అవుతుందని భావిస్తున్నారు. అందుకోసమే ఈ ముద్దుగుమ్మ ఎ హీరో తో నటించిన రెమ్యూనరేషన్ గా 1.5 కోట్ల రూపాయలు తీసుకుంటుందట.

ఇక ఈ రోజున పూజ హెడ్ పుట్టినరోజు సందర్భంగా ఈమె పేరు వెనకాల ఎంత కథ ఉందో ఇప్పుడు చూద్దాం. పూజా హెగ్డే పూర్తి పేరు.. వార్తవ్ పూజా హెగ్డే. తండ్రి పేరు మంజునాథ హెగ్డే. తల్లి పేరు లత హెగ్డే. ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నాడు అతని పేరు రిషబ్ హెగ్డే. ఇక పూజా హెగ్డే లక్ష్మీ దేవత పుట్టినరోజు సందర్భంగా ఈమె పుట్టడంతో ఈమె పేరు మొదట లక్ష్మి అనే పేరును పెట్టారట.

కానీ ఈ పేరు చాలా ఓల్డ్ గా ఉండడంతో ఈమె తన పేరుని లక్ష్మీ దేవత కనుగుణంగా పూజ అని పెట్టుకుందట. ఇక పూజా హెగ్డే నిక్ నేమ్ విషయానికొస్తే పూజ లేదా డాల్ అని పిలుస్తూ ఉంటారట.

Share post:

Latest