పీకే లవ్ అంటూ పూనమ్ కౌర్ ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ లోకి మాయాజాలం సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా అడుగుపెట్టింది పూనమ్ కౌర్. ఆ తరువాత తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలలో నటించింది. నిజం చెప్పాలంటే ఈమె సినిమాలలో కంటే వివాదాల లోనే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది.

ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ ఒక తాజా వార్త వల్ల ఇప్పుడు మరి తిరిగి సోషల్ మీడియాలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు #pk love అనే ట్యాగ్ తో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసి అందరి దృష్టిని తన వైపుకు మళ్ళించింది.

పీకే అనే పేరు వింటే ఎవరికైనా ఒక టాలీవుడ్ స్టార్ హీరో గుర్తుకు వస్తాడు.ఆ షార్ట్ కట్ నేమ్ తో ఎక్కువగా పాపులర్ అయ్యాడు ఆ హీరో. ఇక మరి కొంతమంది ఏమో pk అంటే ఆ స్టార్ హీరోనే ఎందుకు కావాలి. పూనమ్ కౌర్ లేదా పోసాని కృష్ణమురళి కూడా ఉండొచ్చు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.