పాయల్ రాజ్ పుత్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఆర్‌ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని బోల్డ్ బ్యూటీ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్న పాయల్.. ప్రస్తుతం గోవాలో యంగ్ హీరోతో ఫుల్‌గా రొమాన్స్ చేస్తోంది.
![ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమాల్లో రొమాన్స్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాటకు అవసరం అనిపిస్తే హీరోయిన్స్ కూడా బాగానే రొమాన్స్‌కు రెడీ అవుతున్నారు.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/10/28399a7a-15c8-448e-88cf-a33a45bce59f.jpg)
అయితే ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్, పాయల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `తీస్ మార్ ఖాన్`. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. అలాగూ విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
![హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా, ఇది వరకు చూడని సరికొత్త క్యారెక్టరరైజేషన్‌తో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకోనుంది.,[object Object]](https://images.news18.com/telugu/uploads/2021/10/3fc8cf5c-1608-4a35-ae5f-5d53f9931d13.jpg)
అయితే ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. ప్రస్తుతం పాయల్, ఆదిలపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలవనుందట. ఇక తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన కొన్ని పిక్స్ బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారాయి.


