`మా` వార్‌.. పోలింగ్ కేంద్రం ఎదుట ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)​ ఎన్నికలు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్రారంభం అయ్యాయి. హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్ ప్ర‌క్రియ షురూ కాగా.. సినీ ప్రముఖులు ఒక్కోక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.

MAA Elections 2021: Results Will Be Delayed

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే పోలింగ్ కేంద్రం ఎదుట మీడియా ముఖంగా ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ మాట్లాడుతూ.. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. దీనికోసం వ్యక్తిగత దూషణలు అవసరమా..? అని ప్రశ్నించారు. సినిమాలు చేసే వాళ్లు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి కానీ.. ఇలాంటి వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయన్నారు.

All set ready for maa elections 2021, Polling on tomorrow | MAA Elections 2021: మా ఎన్నికలు రేపే, ఏర్పాట్లు పూర్తి | వినోదం News in Telugu

మా ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ ఇలాంటి పోటీని చూడదలేదని ఆయన తెలిపారు. సినిమా ఇండస్ట్రీ చీలడం అనే సమస్యే ఉండద‌ని పవన్‌ తేల్చి చెప్పాడు. ఇక ఎవ‌రికి ఓటు వేస్తానో చెప్పలేన‌ని తెలిపిన ప‌వ‌న్‌నే.. మా ఎన్నిక‌ల్లో తొలి ఓటును వేశారు.

Share post:

Latest