ఓటిటి లొ దగ్గుబాటి రానా అరణ్య.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో ప్రభు సోలమన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం అరణ్య. ఈ సంవత్సరం మార్చి 26న విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ ను చవిచూసింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి లో రాబోతోంది. దసరా కానుక సందర్భంగా అక్టోబర్ 15వ తేదీన zee-5 వేదికగా ఈ సినిమా విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే విశాఖ సమీపంలోని చిలకల కోన అడవిలో ఏనుగులను రక్షించే ఒక కుటుంబంలో నరేంద్ర భూపతి గా (రానా) జన్మిస్తాడు. అడవి ఏనుగుల రక్షణ కోసం పాటు పడుతున్న రానాకు ఫారెస్ట్ మెన్ గా రాష్ట్రపతి పురస్కారం కూడా లభిస్తుంది. కానీ అటవీ శాఖ మంత్రి అడవిని నాశనం చేసి అక్కడ డిఆర్ఎల్ టౌన్షిప్ ను నిర్మించాలని చూస్తుంటాడు. ఇక ఇదే క్రమంలో అడవిని సంరక్షించే అరణ్య గా దానిని ఏ విధంగా అడ్డుకున్నాడు అనేది ఈ సినిమా.

Aranya Ott Release Date - Telugu | Rana Daggubati || RatpacCheck ! - YouTube

ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయ కీలక పాత్రలో నటించారు.

Share post:

Latest