ప్రియుడితో కలిసి ఆలయాలను సందర్శించిన.. నయనతార?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ కు మనందరికీ సుపరిచితమే. ఇక గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. ఈ జంట నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తమ అభిమానం షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల దసరా పండుగ సందర్భంగా విగ్నేష్ శివన్, నయనతార బిజీ బిజీగా గడిపారు. ఈ పండుగ సందర్భంగా వీరిద్దరు కలిసి దేవాలయాలను సందర్శిస్తూ స్ట్రీట్ షాపింగ్ చేశారు.

బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన నటిస్తున్న సినిమా లో షూటింగ్ లో పాల్గొనడానికి ఇటీవల నయనతార పూణే కు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ కాస్త గ్యాప్ దొరకడంతో, లవర్ విగ్నేష్ తో కలిసి షిరిడి వెళ్లారు. ఆ తర్వాత ముంబై చేరుకుని దేవి, మహాలక్ష్మి, సిద్ధి వినాయక ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా నయనతార స్ట్రీట్ షాపింగ్ కూడా చేశారు. ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఆమె ఒక బ్యాగ్ ను బేరం చేస్తూ కనిపించారు. దీనితో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడంతో ఆడవాళ్ళు ఎప్పుడూ ఆడవాళ్లే.. ఇలా బేరం ఆడుతుంటే చూడడానికి చాలా క్యూట్ గా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Share post:

Popular