ఈరోజు పోతావో లేక రేపు పోతావో.. కోట పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు?

ఈసారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. మా ఎన్నికల సందర్భంగా ఇరువురు ప్యానెల్ సభ్యుల మధ్య యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై మరొకరు ప్యానల్ వారు దారుణమైన మాటలను అనుకుంటున్నారు. ఆరోపణలకు వెళ్లి చివరికి శృతిమించి పోయి,వ్యక్తిగత వ్యాఖ్యలు అలాగే దూషణ ల్లోకి దిగి పోయారు. ఇందులో ఎవరు ఏ మాత్రం తగ్గకుండా ఒకరిని మించి మరొకరు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగా నాగబాబు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ పూర్తిగా అదుపు తప్పారు.తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత గొప్ప నటుడు లో ఒకరైన కోట శ్రీనివాస రావు గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రకాశ్ రాజ్ ప్యానల్ ని కోటా వ్యతిరేకిస్తుండడంతో ఆయనకు ఎందుకు మద్దతిస్తున్నారని చిరంజీవి కూడా ప్రశ్నించినట్లు పెరగడం తెలిసిందే? దీనిపై నాగబాబు మాట్లాడుతూ..ప్రకాష్ రాజ్ కు ఉత్తమ నటుడు అతను ఐదు సార్లు జాతీయ అవార్డు సాధించాడు. తెలుగు ఇండస్ట్రీ కూడా మంచి పేరు తెచ్చారు. అయినా కూడా శ్రీనివాసరావుకు ఎందుకంటే ఈ వయసులో ఎప్పుడూ ఉంటాడో, ఎప్పుడు ఊడిపోతాడో తెలియదు. అనకూడదు కానీ ఈ మాట అతని వయసుకు తగిన మాట మాట్లాడట్లా. అతని మాటలు విని విని విసుగొస్తుంది. ప్రకాష్ రాజ్ మన బాష కాకపోతే తరిమేస్తారా. నటులకు మన, పర బేదాలు ఏంటండి వీళ్ళా నటులు . నటులు అంటే విశాల దృక్పథం ఉండాలి. వీళ్లకు మానవత్వం లేదు. నటన విషయానికి వస్తే వీళ్ళందరూ కాదు ప్రకాష్ రాజ్ కాలి గోటికి కూడా సరిపోరు అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Share post:

Latest