కౌబాయ్ గెటప్ లో హీరో ధనుష్?

తమిళ్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తుల్లువదో ఇలమై అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ధనుష్. మొదట ఇతడు హీరోనా అంటూ హేళన చేసినవారి నోర్లు మూయించి, ప్రస్తుతం తమిళ స్టార్ హీరోగా వెలుగుతున్నాడు ధనుష్.హీరోగా ఎదగాలి అంటే పర్సనాలిటీ కలర్ కి ముఖ్యం కాదు, కష్టపడటం ముఖ్యం అని నిరూపించాడు. ఇది ఇలా ఉంటే ధనుష్ హీరోగా కొత్త సినిమా ఆరంభం అయ్యింది. చాలా కాలం తరువాత తన అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.

కెరీర్ మొదట్లో ధనుష్ విజయంలో కీలక పాత్ర పోషించాడు సెల్వరాఘవన్. వీరిద్దరి కాంబినేషన్ లో కాదల్ కొండేన్, పుదుపేటై, మయక్కం ఎన్న లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ధనుష్ తో అసురన్, కర్ణన్ వంటి సినిమాలు తీసిన వి క్రియేషన్స్ అధినేత కలైపులి ఎస్ థాను సెల్వరాఘవన్ దర్శకత్వంలో మరొక సినిమాను మొదలు పెట్టారు. తాజాగా ఈ సినిమా ఆరంభమయ్యింది. నావే వరువేన్ పేరు తో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మొదటి రోజు విడుదల చేశారు. ఇందులో ధనుష్ కౌబాయ్ గెటప్లో కనిపిస్తున్నారు.