అమెజాన్ ప్రైమ్ లో విశేషాధారణ దక్కించుకుంటున్న ‘ముగ్గురు మొనగాళ్ళు’

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకొన్న చిత్రం ముగ్గురు మొనగాళ్ళు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ట్రైలర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఆగస్టు 6 న థియేటర్లలో విడుదలైన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటీలో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరిస్తోంది. అంగవైకల్యం ఉన్న ముగ్గురు వ్యక్తులు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలా బయట పడతారు అంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఇందులో శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, వెన్నెల రామారావు కు కనపడదు. ఇక వీరి నటనతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

ఇందులో గరుడ వేగా సినిమా ఫేమ్ అంజి అందించిన విజువల్స్, అలాగే సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం వంటివి ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.

అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా చిత్రమందిర్ స్టూడియోస్ బ్యానర్ పై అచ్యుత్ రామారావు నిర్మించారు అలాగే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ లో విడుదలయ్యి అంతే ఆదరణ పొందుతోంది. అంతేకాకుండా ఈ ముగ్గురు మొనగాళ్లు సినిమా అమెజాన్ ప్రైమ్ లో నెంబర్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే…

 

Share post:

Popular