మూడు ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత..?

October 20, 2021 at 4:26 pm

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య సమంత. ఇక వీరిద్దరూ ఎన్నో కారణాల చేత విడిపోవడం జరిగింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయం ఎవరికీ తెలియలేదు. కానీ ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటూ ఉండడంతో వారందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సమంత.

ఇదే క్రమం లోనే కొన్ని యూట్యూబ్ ఛానల్ మీడియాలో ఇష్టానుసారంగా కథలు అల్లుతూ సమంతను టార్గెట్ చేసి ఆమె పరువు తీసేలా విష ప్రచారం చేశాయి. సమంత నాగచైతన్య విడిపోవడానికి ముఖ్యకారణం ప్రీతమ్ జుక్కల్ రే అని కొన్ని యూట్యూబ్ చానల్స్ పదే పదే చూపించి వీరిని ట్రేడింగ్ చేయడంతో ఈమె ఈ విషయంపై స్పందించింది.

నిజానికి ప్రీతం సమంతను అక్క అని పిలుస్తాడు.. కానీ యూట్యూబ్ ఛానల్స్ నెటిజన్లు మాత్రం వీరిద్దరి పెట్రోలింగ్ చేయడం తో సమంత న్యాయ పరమైన చర్యలకు దిగింది. సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై కూకట్పల్లి కోర్ట్ లో సమంత పరువునష్టం దావా వేసింది. సమంత నాగ చైతన్య విడాకులపై ఈ మూడు యూట్యూబ్ ఛానల్ అసత్య ప్రచారాలు చేశాయని సమంత పిటిషన్లో తెలియజేసింది. అయితే అవి ఏ చానల్స్ అని మాత్రం పేరు తెలియలేదు.

మూడు ఛానెల్స్ పై పరువు నష్టం దావా వేసిన సమంత..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts