ఇలాంటి సమయంలో సెలబ్రేషన్స్ కావాలి.. నాగ చైతన్య?

అక్కినేని అఖిల్,పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో వాసు వారితో కలిసి బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 15 న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ.. అఖిల్ ఒక సినిమా ఫలితం కన్నా దానికి ప్రిపేర్ అయ్యే విధానం ఎక్కువగా ప్రేమిస్తాడు. తనలో అదే నాకు బాగా నచ్చుతుంది. ఇదే కాకుండా రానున్న అయిదారు ఏళ్లలో ఇలాంటి సినిమాలు తీయాలి ఎలాంటి పాత్రలు చేయాలి అన్న మాస్టర్ ప్లాన్ తన మైండ్ లో ఉంటుంది.సిసింద్రీ సినిమా నుంచి ఇప్పటివరకు తనని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది.

ప్రతి ఏడాది ఇంట్లో కొత్త అతన్నే చూస్తూ ఉంటాను.. ఒక్క సినిమాకి తను అంత అంకితం అవుతాడు అని తెలిపారు నాగచైతన్య. అలాగే నా తొలి సినిమా అయినా జోష్ సినిమాకి వాసు వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలా నేర్చుకున్నాను. బన్నీ వాసు తో 100% లవ్ సినిమా చేశాను. తన ప్రయాణం చూసి నాకు గర్వంగా ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే ఒక సక్సెస్ ఫుల్ సినిమా తియ్యాలి అంటే అంత కేర్ ఉండాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్ చూస్తుంటే ఒక సెలబ్రేషన్స్ లా అనిపించింది. ఇలాంటి సమయంలోనే థియేటర్స్ లో మన ప్రేక్షకులకు సెలబ్రేషన్స్ కావాలి. ఈ సినిమా ఆ సెలబ్రేషన్ ని ఇస్తుందని నమ్ముతున్నాను అని నాగచైతన్య తెలిపారు.