మెగాస్టార్ ఫ్యామిలీ ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వనట్టేనా..?

అక్టోబర్ 10వ తేదీన సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ని మంచు విష్ణు , ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.ఇక ఇందులో భాగంగానే మంచు విష్ణు కు పెద్ద హీరోల సపోర్ట్ తీసుకుని సినీ ఇండస్ట్రీలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మంచు విష్ణు తరఫున కృష్ణంరాజు ,బాలకృష్ణ ,బాబు మోహన్ లాంటి ఎంతో మంది పెద్దవాళ్ళు మంచు విష్ణు తరుపున నిలబడి సినీ ఇండస్ట్రీ నటీనటులతో మాట్లాడుతున్న విషయం తెలిసిందే

ప్రకాష్ రాజ్ కు మొదట్లో పెద్ద హీరోల మెగా ఫ్యామిలీ నుంచి పూర్తిగా మద్దతు లభించిన విషయం తెలిసిందే. ప్రకాష్ రాజ్ వైపు కూడా జీవితా రాజశేఖర్ ,శివారెడ్డి సుధీర్ ,అనసూయ లాంటి పాపులర్ స్టార్స్ ఉన్నప్పటికీ పెద్ద హీరోలు మాత్రం ఎవరు మద్దతు చెప్పడం లేదు ..చిరంజీవి ఫ్యామిలీ మొదట్లో ఫుల్ సపోర్ట్ ఇచ్చినా..ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద గా ఉన్నది చిరంజీవి మాత్రమే కాబట్టి ఇద్దరికి న్యాయం చేయడం కోసం ఇద్దరికీ సపోర్ట్ చేస్తానని తెలిపాడు.. కానీ ప్రకాష్ రాజ్ కు మాత్రమే సపోర్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేయలేదు.

ఇక కాబట్టి ప్రకాష్ రాజు కు మాత్రం పెద్ద హీరోల మద్దతు తగ్గిందనే చెప్పాలి. ఇటీవల మెగాఫ్యామిలీ స్పష్టం చేసిన విషయం ఏమిటంటే ప్రకాష్ రాజ్ కి మంచి అభిమానులమే కానీ రాజకీయ పక్షం లో పాల్గొనడానికి ఇష్టపడమని స్పష్టం చేశారు. ప్రకాష్ రాజు ప్యానల్ నుంచి ఒక నటి వెళ్లి మెగాస్టార్ నీ సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమెతో కలిసి ఫోటో దిగడానికి వీలు సున్నితంగా తిరస్కరించడం జరిగింది.. అంతేకాదు మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రకాష్ రాజు కు ఎన్నికల విషయంలో సపోర్ట్ చేయడానికి ప్రస్తుతం ఏ మాత్రం ఇష్టం చూపడం లేదు.. ఇవన్నీ చూస్తుంటే మెగాఫ్యామిలీ మా ఎన్నికలకు ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది.