మంచు విష్ణు భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?

మంచు విష్ణు తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ పడి ప్రత్యర్థి ప్రకాష్ రాజు పై విజయం సాధించాడు.. అంతే కాదు ఈయన మా అధ్యక్షుడి గా పదవికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారి 60 సంవత్సరాలు పైబడిన నటీనటులకు వృద్ధాప్య పింఛన్ పై సంతకం కూడా చేశాడు.. ఇక ప్రస్తుతం చాలామంది మంచు విష్ణు వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి తెగ ఆలోచిస్తున్నారు.. ముఖ్యంగా మా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారం కూడా మంచు విష్ణు కు లభించిందని ఆ కారణం చేతనే ఈయన విజయం సాధించాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇకపోతే తాజాగా మంచు విష్ణుకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బావ అవుతాడు.. మంచు విష్ణు భార్య కు జగన్ మోహన్ రెడ్డి కి మధ్య ఉన్న బంధుత్వం ఎలాంటిది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మంచు విష్ణు.. విరానికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విరానికా వరుసకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు అవుతారు.అంటే వైయస్ జగన్ తాతగారు అయిన వైఎస్ రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తె విరనికా.. ఆమె అమెరికాలో పుట్టి పెరిగారు. వీరి కుటుంబానికి ఆఫ్రికాలో చాలా వ్యాపారులున్నాయి. ఆమె అభిరుచులు, అలవాట్లు, వ్యక్తిత్వానికి మంచు విష్ణు ఫ్లాట్ అయిపోయారు.ఈ దంపతులకి నలుగురు పిల్లలున్నారు. విరనికా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. అలాగే టీవీలు, ప్రెస్‌మీట్‌లలో సైతం కనిపించకుండా ప్రోఫైల్ మెయింటైన్ చేస్తూ వుంటారు. కానీ వ్యాపారాలు, కుటుంబ విషయాల్లో భర్త మంచు విష్ణుకి చేదోడు వాదోడుగా వుంటున్నారు.

Share post:

Popular