మంచు ప్యానెల్ నుంచి విడుదలైన 14 వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టో..!

రాజకీయ నాయకులైనా..ఏదైనా రంగానికి అధ్యక్షత వహించే నాయకుడైన తప్పకుండా సరే .. నాయకుడు అయిన తరువాత తమ ప్రజలకు ఏమేం చేస్తారు అనేది ఒక మేనిఫెస్టో రూపంలో విడుదల చేస్తారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా మా ఎలక్షన్లలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులతో చర్చించి, సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల కోసం ఏం చేయాలి.. ఏం చేయబోతున్నాం అనే విషయాలను ముఖ్యంగా 14 వాగ్దానాలతో కూడిన ఒక మేనిఫెస్టోను విడుదల చేశారు..

అంతేకాదు మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. స్వచ్ఛమైన తెలుగు ప్యానెల్ ను ఆశీర్వదించండి ..తెలుగు సినీ పరిశ్రమ ఆత్మగౌరవం కాపాడుకుందామని పేర్కొన్నాడు.. తను విడుదల చేసిన 14 వాగ్దానాలతో కూడిన మేనిఫెస్టోను కూడా వివరించడం జరిగింది.. కొత్తగా సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వారి కోసం మా యాప్ క్రియేట్ చేయడం, మా పోర్ట్ ఫోలియో క్రియేట్ చేస్తామని, దీనివల్ల ఓ టీ టీ మరియు సినిమాలలో అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇక రెండవది మా భవనం. మాలో ఉన్న సభ్యులకి ఉపయోగపడే విధంగా మా భవనం ఏర్పాటు చేయడం , మూడవది సొంత ఇంటి కల.. అర్హులు అయిన వారికి ప్రభుత్వం సహకారంతో శాశ్వత నివాస గృహాన్ని కూడా ఏర్పాటు చేయిస్తామని తెలిపాడు.

ప్రతి ఒక్కరికి వైద్య సదుపాయం, ఆరోగ్య బీమా, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం, ఉచిత మెడికల్ టెస్ట్ నిర్వహణ ,ఉచిత వైద్య శిబిరాలు , ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డ్ సెంటర్ అని హామీ కూడా ఇచ్చారు మంచు విష్ణు. ఇక చదువుల తల్లి.. మా సభ్యుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు విద్యా సహాయం అందిస్తామని తెలిపాడు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష 16 వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. మహిళా రక్షణ పై హైపవర్ కమిటీ, ఇండస్ట్రీలో నో కాస్టింగ్ కౌచ్, వృద్ధ కళాకారుల సంక్షేమం, సీనియర్ సిటిజన్స్ కి ఓటు హక్కు వచ్చేలా ఏజీఎం లో ఆమోదం తెచ్చి మరీ అమలు చేస్తామని తెలిపారు.

ఇదే నేపథ్యంలోనే మా ఉత్సవాలు, మా మెంబర్షిప్ కార్డు, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడటం.. మోహన్ బాబు ఫిలిం ఇన్స్టిట్యూట్ తోపాటు ప్రభుత్వాల సహాయ సహకారాలు కూడా అందించేలా చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు..