మంచు లక్ష్మి తో ఎన్నో కలిసి చేయాలంటున్న రకుల్…!

హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్,మంచు లక్ష్మి ఎంత సన్నిహితంగా ఉంటారో మనకి తెలిసిన విషయమే. వీరిద్దరిపై నెట్టింట్లో రకరకాల రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి. వీరిద్దరూ హగ్స్ చేసుకోవడం ముద్దులు పెట్టుకోవడం వంటి పై నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు. అంతే కాకుండా వీరిద్దరీ పై కామెంట్లు కూడా వినిపిస్తుంటాయి. ఇక వీరిద్దరూ కలిసి ఒకే చోట చేరారు అంటే ఇక రచ్చ రచ్చ మామూలుగా ఉండదు.. అయితే వీరిద్దరూ కలిసి తమ బర్తడే సెలబ్రేషన్ ఒకే చోట చేసుకోవాలనుకున్నారు.

కానీ తాజాగా మంచు లక్ష్మి విదేశాలలో ఉండడంవల్ల తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది.తాజాగా కొండపొలం సినిమా ప్రమోషన్ల కోసం రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడే బిజీగా ఉండి పోయింది.మంచు లక్ష్మికి బర్త్ డే సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ తనదైన స్టైల్లో విషెస్ తెలియజేసింది.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ నుండి మంచు లక్ష్మీ రకుల్ ముద్దులు పెట్టుకుని ఇటువంటి ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే మై సోల్ సిస్టా.. నీలాంటి వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు..నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నేను లక్కీ. నిన్ను ఆకాశమంత ప్రేమిస్తున్నాను. నీకు నేను ఎప్పుడూ లెక్చర్ ఇస్తూనే ఉంటాను అని తెలుసు.మనమిద్దరం కలసి ఇంకా ఎన్నో చేయవలసినవి ఉన్నాయంటూ కామెంట్ చేస్తోంది.

https://www.instagram.com/p/CUwHAOcqL7b/?utm_source=ig_web_copy_link