మా ఎలక్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన రవి బాబు..!

ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో మా ఎలక్షన్లు జరుగుతాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ ల కోసం ఒక అసోసియేషన్ కూడా ఏర్పాటు చేశారు అనే విషయం కూడా ఇప్పుడిప్పుడే ప్రేక్షకులకు తెలుస్తోంది. అక్టోబర్ 10వ తేదీన జరగబోయే మా ఎలక్షన్లకు అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరు మాటల తూటాలతో బాంబులు పేలుస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలలో లేని విధంగా ఈ మా ఎలక్షన్ల కోసం పోటీపడడం ఇదే మొదటిసారి. మా అధ్యక్ష పదవిని సీనియర్ నటుడు నరేష్, శివాజీరాజా చేపట్టినప్పటికీ ఎంతో చక్కగా నిర్వహించారు.

అప్పుడు ఏ మాత్రం గొడవలు లేవు కానీ ఇప్పుడు మాత్రం చాలా సమస్యలు ఎదురవుతున్నాయి . ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు, దర్శకుడిగా గుర్తింపు పొందిన చలపతిరావు కుమారుడు అయినటువంటి దర్శకుడు, నటుడు హార్రర్ చిత్రాలకు పెట్టింది పేరు రవిబాబు కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రవిబాబు మాట్లాడుతూ.. లోకల్ నాన్ లోకల్ విషయాల గురించి నేను ఇప్పుడు స్పందించను..మా లో ఎలక్షన్ జరుగుతుంటే బయట వాళ్లని ఎందుకు లాగుతున్నారు. ఎవరో ఒకరి ప్యానల్ కి ఓటు వేయండి అని చెప్పడానికి నేను రాలేదని రవిబాబు తెలియజేశాడు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండగా.. మన డైరెక్టర్, నిర్మాతలు మాత్రం ఎక్కువగా బయట వాళ్లకే అవకాశాలు ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అంతేకాకుండా వారి డిమాండ్లను ఒప్పుకొని మరీ సినిమాలలో నటించేందుకు అవకాశం ఇస్తున్నారని ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇంకా కెమెరామెన్ లు, మేకప్మేన్ ల విషయాల్లో కూడా వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నట్లుగా చెప్పుకొస్తున్నాడు. ఇలా సినీ రంగంలో ఎంతో మంది మన వాళ్ళ కంటే బయట వాళ్లే ఎక్కువగా ఉన్నారని చెప్పుకొస్తున్నారు. మా ఎన్నికలు కేవలం మన సినీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకోవడం కోసమే దానిని ఏర్పాటు చేసుకున్నాము అని తెలుపుతూచ్చారు.

మన కోసం మనం నిర్మించుకున్న ఈ మా సంస్థ లో పని చేయడానికి మన సినీ ఇండస్ట్రీలో ఒక్కరు కూడా పనికి రారా..? అని ప్రశ్నిస్తున్నాడు. ఇక దీనిలో కూడా బయట వారిని ఎంచుకోవాలా అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఇది మన సమస్యే కదా.. మనం నడిపించు కోలేమా.. మనకి చేతకాదా అంటూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.