మా ఎన్నిక‌ల‌పై ఆర్ఎక్స్100 ద‌ర్శ‌కుడి పంచ్‌..!

మా ఎన్నికలపై ఇప్పుడిప్పుడే రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన జరగబోయే ఈ మా ఎన్నికల విషయంలో నటీనటులు ఒకరికొకరు ఎంతో అధ్వానంగా దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎక్స్100 సినిమా తో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అజయ్ భూపతి సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశాడు..

నిజానికి రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం పుచ్చుకున్న దర్శకులు ఎవరైనా సరే కాంట్రవర్సీ కి కేరాఫ్ అడ్రస్ గా మిగులుతారు అనే విషయం అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే అజయ్ భూపతి కూడా తనదైన శైలిలో అందరిపై కామెంట్లు విసురుతున్నాడు. అంతే కాదు మా ఎన్నికలలో జరుగుతున్న సన్నివేశాలను చూసి 2, 3 త్రిల్లింగ్ సినిమాలలో నేను కూడా నటించి అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను అంటూ కామెంట్ చేశాడు.

ఎవరైతే నాకు నచ్చిన ప్యానల్ కు మద్దతు ఇస్తారో వారికి నా సినిమాలలో క్యారెక్టర్లకు కథ రాస్తాను అంటూ కూడా షాకింగ్ కామెంట్ చేయడంతో సినీ ఇండస్ట్రీ షాక్ కి గురి కావడమే కాకుండా వర్మ శిష్యుడు అని అనుకునేలా చేశాడు.. ఇకపోతే ఇతను దర్శకత్వం వహించిన రెండవ సినిమా మహాసముద్రం మరో ఎనిమిది రోజుల్లో విడుదల కాబోతోంది కనుక ,ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసి కౌంట్డౌన్ కూడా స్టార్ట్ చేశాడు.

https://twitter.com/DirAjayBhupathi/status/1445800264586301443?s=20