మా ఎలక్షన్లలో.. తెర వెనుక రాజకీయం జరిగిందా..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఇక ఇందులో మంచు విష్ణు గెలుపొందాడు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ రాజీనామా సమర్పించారు. ఇంతవరకు బాగున్నప్పటికీ ఆ తరువాత తెరవెనుక ఎలాంటి కథనాలు జరిగాయో ఇప్పుడు చూద్దాం.

నాగబాబు రాజీనామా సమర్పించారు, ఆ తర్వాత ప్రకాష్ రాజు కూడా తన రాజీనామాను సమర్పించారు. ఇక ఆ తర్వాత శివాజీరాజా నరేష్ పై కూడా చర్యలు తీసుకోకపోతే రాజీనామాలు చేస్తామంటూ కూడా మరికొందరు హెచ్చరించారు. ఇక ఆ తరువాత ప్రకాష్ రాజు ఫైనల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు రాజీనామా చేశారు.

అలా ఎందుకు చేశారు అని అడగగా విష్ణు పనులకు తాము అడ్డు రాకూడదని పెద్దపెద్ద హామీలు ఇచ్చారు కాబట్టి ఆయన చేస్తారన్నారు. అందుచేత మేము రాజీనామా చేశాం అన్నట్లుగా తెలియజేశారు. ఇక సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఫ్యామిలీ ఎటువైపు ఉంటే అటువైపు విజయం అన్నట్లుగా వారు భావించినప్పటికీ.. మోహన్బాబు రంగంలోకి దిగడంతో అంతా తారుమారు అయ్యింది. మంచు విష్ణు ఏకంగా 200 పైగా ఓట్లు సంపాదించాడు.

దీంతో చిరంజీవి వర్గం కుదేలు అయిపోయింది. ఇక మెగా ఫ్యామిలీ అవమానం కరంగా ఫీల్ అవ్వడం తో మరో అసోసియేషన్ ఏర్పాటుకు కూడా తెరలేపారు. ఇదంతా కేవలం తెరవెనుక రాజకీయమే జరిగింది అన్నట్లుగా ఉంది. మన హీరోలు తెరవెనుక కూడా బాగానే నటిస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.