మా ఎన్నికల పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు..!

విలక్షణ నటుడు మోహన్ బాబు ఇటీవల మా ఎన్నికలపై స్పందించారు. ఇటీవల హాజరైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆర్కే అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.. మా ఎన్నికల సందర్భంగా నీచ, నికృష్ట, దరిద్రపుగొట్టు, భ్రష్టు రాజకీయాలు నెలకొన్నాయి అంటూ విమర్శించారు.. క్యారెక్టర్ లేని వాళ్ళు అదేదో కిరీటము అనుకొని.. అద్భుతం అనుకొని.. ఏవేవో మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.. విష్ణుని మా ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకోలేదని, కానీ కొన్ని కారణాల వల్ల విష్ణు చివరికి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపాడు..

ఇండస్ట్రీ లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహారం సాగుతోందని, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అని కూడా తెలిపారు.. గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరుగుతూ ఉంటాయి అని ప్రతి వాటికి బదులు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశాడు.. చిరంజీవి పై తనకు ఉన్న స్నేహం పై స్పష్టత ఇచ్చారు.. ఇవాళ, రేపు, ఎప్పటికీ కూడా చిరంజీవి తనకు మంచి స్నేహితుడని స్పష్టంచేశారు మోహన్ బాబు..

చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా మా ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, వారు తనతో ఎన్నికల కు సంబంధించి ప్రతిపాదన చేస్తే ఖచ్చితంగా విష్ణును ఎన్నికల నుంచి ఉపసంహరింప చేసే వాడిని అని తెలిపాడు.. చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ పిల్లల్ని కూడా తన పిల్లల్లాగే భావిస్తానని వెల్లడించాడు. అంతే కాదు మా ఎన్నికల్లో ఇన్ని పరిణామాలు జరగకపోయి ఉంటే తన కొడుకుని చిరంజీవి వద్దకు తీసుకెళ్ళి వాడినని వివరించాడు. కేవలం కృష్ణ వద్దకు మాత్రమే తీసుకెళ్లి ఆశీస్సులు తీసుకున్నామని తెలిపాడు