కోటీ  రూపాయలతో సినిమా తీస్తే ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?

October 13, 2021 at 6:48 pm

సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు వాటి విలువ తెలియక పోవచ్చు కానీ ఆ సినిమా ఎంత పెద్ద విజయం అవడంతో ఆ చిత్రాన్ని వదులుకున్న నటీనటులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి అద్భుతమైన చిత్రాలు నువ్వేకావాలి సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా విడుదలై ఇప్పటికి 21 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఇక ఈ సినిమాలో తరుణ్ హీరోగా, రిచా పల్లాడ్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ సినిమాని డైరెక్టర్ విజయ భాస్కర్ తెరకెక్కించాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు రాశాడు. ఈ సినిమాతోనే కమెడియన్ సునీల్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ విషయానికొస్తే కోటీ రూపాయల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా కలెక్షన్లు విషయానికి వస్తే దాదాపు 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు చేసి తెలుగు సినిమాలో ఉన్న రికార్డులన్నీ అప్పటివరకు తిరగరాసింది.

ఈ సినిమా ఇంతటి సక్సెస్ కావడానికి ముఖ్యకారణం ఈ సినిమాలోని పాటలను చెప్పుకోవచ్చు. ఈ సినిమాని హీరో పవన్ కళ్యాణ్ కూడా రరిజెక్ట్ చేసినట్లు సమాచారం.

కోటీ  రూపాయలతో సినిమా తీస్తే ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts