కాజల్ అగర్వాల్ క్రేజ్ మామూలుగా లేదుగా ..?

టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోల సరసన నటించింది.పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తుంది.పెళ్లి అయ్యాక కూడా కాజల్ క్రెజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ రీసెంట్‌గా ఒక ఘనత సాధించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ ఫాలోవర్ల సంఖ్య అక్షరాలా 20 మిలియన్ల మార్క్ ను టచ్ చేసింది. ఎవరికీ లేని ఫాలోవర్స్ కాజల్ కి ఉన్నారు అంటే చెప్పుదగ్గ విషయం అనే చెప్పాలి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన సమంత, పూజా హెగ్డేలను సైతం దాటేసి కాజల్ ఈ ఘనత సాధించడం విశేషం.ఇప్పటిదాకా సమంతకు 19.4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండగా, పూజా హేగ్జేను 15.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సమంతను కూడా క్రాస్ చేసి 20 మిలియన్ల మందిని ఫాలోవర్స్ ను కాజల్ సంపాదించుకుంది. అలాగే ట్విట్టర్‌లో కూడా కాజోల్ కు 5 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు..