‘ అస‌లేం జ‌రిగింది ‘ … చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌..!

టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు వ‌స్తున్నాయి. హీరో ఎవ‌రు , హీరోయిన్ ఎవ‌రు , అస‌లు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎవ‌రో కూడా తెలియ‌దు. అయినా కూడా ట్రైల‌ర్ చూస్తే చాలు ఆ సినిమా ఖ‌చ్చితంగా చూడాల‌న్న ఆతృత చాలా మందిలో క‌లుగుతోంది. ఇలా ఎలాంటి హ‌డావిడి లేకుండా వ‌చ్చి సూప‌ర్ హిట్ అవుతున్న సినిమాలు ఇటీవ‌ల చాలానే ఉన్నాయి. ఈ లిస్టులోనే అస‌లేం జ‌రిగింది సినిమా కూడా క‌నిపిస్తోంది. తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లెలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

Asalem Jarigindi : హీరో శ్రీరామ్‌కు 'అసలేం జరిగింది?'.. అప్పుడే  తెలుస్తుంది.. | The Telugu News

టాలీవుడ్‌లో గత ఆరేళ్ల నుంచి ప్రొడక్షన్ కంపెనీలో ఉన్న ఎక్సోడస్ మీడియా మొట్టమొదటిసారిగా అసలేం జరిగింది సినిమాను నిర్మించింది. చిన్న సినిమా అయినా క‌థ తో పాటు న‌టీన‌టులపై ఉన్న న‌మ్మ‌కంతో నిర్మాత‌లు సాంకేతికంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సినిమా ట్రైల‌ర్ చూస్తేనే ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది.

Asalem Jarigindi (2021) - IMDb

ట్రైల‌ర్‌లో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద‌ర గొట్టాయి. ఇక 5.1, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టాప్ టెక్నీషియ‌న్ల‌ను వాడారు. కోలీవుడ్ క్రేజీ హీరో శ్రీరామ్‌తో పాటు సంచిత జంట‌గా న‌టించారు. ఏలేంద్ర మ‌హ‌వీర్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఎన్‌వీఆర్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న గ‌తంలో ప‌లు సినిమాల‌కు కెమేరామెన్‌గా ప‌నిచేశారు. ఈ సినిమాతో ఆయ‌న మెగా ఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించు కుంటున్నారు.

Share post:

Popular