హీరో కార్తీకేయ అజిత్ వలిమై మూవీ ఫోటోలు వైరల్..!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా, హుమాఖురేషి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “వలిమై” ఈ సినిమాని దర్శకుడు H.వినోద్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎటువంటి చిన్న పోస్ట్ విడుదలైన కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా సినిమా సెట్ లో నుంచి కొన్ని ఫోటోలు బయటికి రావడం వల్ల వైరల్ గా మారుతున్నాయి. హీరో అజిత్ కూడా ఒక రేసర్ అనే విషయం మనకు తెలిసిందే.

ఇక హీరో అజిత్ తనకున్న టాలెంట్ ను నంతా ఉపయోగించి ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఇదే ఇప్పుడు సినిమాలో విలన్గా నటిస్తున్న యంగ్ హీరో కార్తికేయ తో కలిసి తమ రేసింగ్ బైక్ పైన ఫోటోలు బయటికి విడుదల కావడం జరిగింది.ఈ ఫోటో ని చూస్తే.. ఇద్దరి మధ్య భారీ యాక్షన్ సీన్ ఉన్నట్లుగా కనిపిస్తోంది.

ఇక ఇంతకు ముందే హీరో కార్తికేయ గ్యాంగ్ లీడర్ సినిమాలో ఒక రేసర్ గా కూడా కనిపించాడు. ఇప్పుడు ఏకంగా అజిత్తో అంటే ఆ సన్నివేశాలు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి బోనికపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

Share post:

Latest