గొడవలు జరిగితే పోలింగ్ రద్దు చేస్తాను: పోలింగ్ అధికారి..?

మా ఎన్నికలు ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఛానల్ సభ్యులు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. అలాగే ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు కూడా మంచు విష్ణు ప్యానెల్ సభ్యులతో గొడవ పడుతున్నారు.. ఇరు వర్గాల వారు ఒకరికొకరు గొడవ పడటం తో పోలింగ్ బూత్ బయట పెద్ద ఎత్తున గొడవలు జరగడంతో, పోలీసులు ఇరు వర్గాల వారిని పోలింగ్ సెంటర్ కి దూరంగా ఉంచినట్లు సమాచారం.ఇకపోతే నమూనా బ్యాలెట్ ను ఇస్తున్నారు అని విష్ణు ప్యానెల్ వర్గం వారు శివారెడ్డిని అడ్డుకున్నారు.

Mohan Babu Serious Warning at Polling Booth

ఇకపోతే ప్రకాష్ రాజు తరపున ఎవరో దొంగ ఓటు వేశారని, రిగ్గింగ్ జరిగిందని మోహన్ బాబు పెద్ద ఎత్తున అరుస్తూ ఉండడంతో ఎన్నికల కమిషనర్ వచ్చి.. ఇలా గట్టిగా అరిస్తే ఎన్నికలను రద్దు చేస్తామని.. కూడా వార్నింగ్ ఇచ్చాడు. రిగ్గింగ్ జరిగిందని తెలియడంతో ఒకరి కొకరు మాటల తూటాలు విసురుకుంటుండడంతో, ఎన్నికల అధికారి బయటకు వచ్చి, అలాగే గొడవ చేస్తే తప్పకుండా ఎన్నికలను రద్దు చేస్తామని ప్రకటించాడు.

Share post:

Latest