భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో రానున్న గంధర్వ.. ఎప్పుడంటే?

వంగవీటి, జార్జిరెడ్డి లాంటి సినిమాలతో తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ మాధవ్. ఇందులో గాయత్రీ ఆర్ సురేష్, శీతల్ బట్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను ఫన్నీ పాక్స్ సెంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఎం ఎన్ మధు నిర్మిస్తున్నారు. ఇందులో సాయికుమార్, సురేష్ బాబు, బాబు మోహన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది .

ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో రాని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోందని ఈ చిత్ర బృందం తెలిపింది. అంతేకాకుండా ఇందులో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని వెల్లడించింది. ఇటీవలే షూటింగ్ జరిగిన ఈ యాక్షన్ సీక్వెన్స్ లో హీరో సందీప్ ముఖ్య నటులతో పాటు గా 50 మంది ఫైటర్స్ పాల్గొన్నారని తెలిపారు చిత్రబృందం. హీరో సందీప్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వెండి నాణేలను బహూకరించి ఆనందించింది చిత్రయూనిట్. ఇందులో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.

Share post:

Popular