ఫేస్బుక్ పేరులో మార్పు ఎందుకంటే.?

సోషల్ మీడియాలో దిగ్గజ కంపెనీ అయిన ఫేస్బుక్ ను మార్క్ జుకర్ బర్గ్ 2004లో స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే . అయితే ఫేస్బుక్ తన పేరు మార్చుకోనుందంటూ, అలాగే కంపెనీని కొత్త పేరుతో రీ బ్రాండింగ్ చేయడానికి యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మంగళవారం టెక్ పత్రిక అయిన ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది.

అక్టోబర్ 28న ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ నిర్వహించే కంపెనీ కాన్ఫరెన్స్లో పేరు మార్పు గురించి ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమావేశంలో కొత్త పేరు ప్రకటించే అవకాశం ఉండొచ్చు అని పలువురు తెలుపుతున్నారు. అయితే ఫేస్బుక్ పేరు మార్పు వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు. సంస్థలు తమ సేవలను విస్తరించినప్పుడు బ్రాండ్ ను మార్చడం సాధారణమే. 2015లో గూగుల్ ఇలాగే ఆల్ఫాబెట్ కంపెనీ ఏర్పాటు చేసి దాన్నే మాతృసంస్థ గా చేసింది.