సినిమా రివ్యూలు రాసేవారిపై విశాల్ షాకింగ్ కామెంట్స్..ఆయనేమన్నారంటే..!

సినిమాలకు రివ్యూ రాసేవారిపై తమిళ స్టార్ హీరో విశాల్ షాకింగ్ కామెంట్లు చేశాడు. సినిమా బాగున్నా.. బాగా లేకపోయినా.. కొందరు అదేపనిగా నెగిటివ్ రివ్యూలు రాస్తుంటారని.. దయచేసి అలాంటి రివ్యూలు రాయొద్దని విశాల్ వ్యాఖ్యానించారు. విశాల్ హీరోగా, ఆర్య విలన్ గా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎనిమి. దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ ఉన్న సమయంలో ఎంతో కష్టపడి ఈ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.
సినీ రివ్యూలు రాసే వారు సినిమా బాగున్నా.. బాగా లేకపోయినా.. నెగిటివ్ రివ్యూలు రాస్తుంటారని వాపోయారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు నిర్మించిన నిర్మాతలు ఊపిరి పీల్చుకునేలా పాజిటివ్ రివ్యూలు రాయాలని విశాల్ ఈ సందర్భంగా విన్నవించారు.

చాలామంది ప్రేక్షకులు సినిమా రివ్యూ చూసి థియేటర్ వెళతారని, మీరు రాసే నెగిటివ్ రివ్యూపై సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. సినిమాలు నిర్మించిన నిర్మాతలు ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా సినీ క్రిటిక్స్ సహకరించాలని విశాల్ కోరాడు. సినిమా రివ్యూ రాసి విశాల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Share post:

Latest