వీడియో: ఈ చిన్నారుల కష్టం ఎవరికీ రాకూడదు.. టీవీ షోరూమ్ ముందే వారేం చేశారంటే..!

ప్రస్తుతం కలికాలం నడుస్తుందనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇప్పుడు అంతా ఇంటర్నెట్ కాలం నడుస్తుందనే చెప్పాలి. అందులోనూ సోషల్ మీడియా గురించి అయితే చెప్పనవసరం లేదు. అరచేతిలో ఫోన్ పట్టుకుని ప్రపంచం నలుమూలలా జరిగే వింతలు, విశేషాలు చూసేయవచ్చు. క్షణాల్లో ఎక్కడ ఏమి జరిగినా ఇట్టే అందరికి తెలిసిపోతుంది. ఆ వీడియో గానీ ఫోటో గాని నెటిజన్లకు నచ్చితే తెగ వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. చిన్నారులు చేసే పని చూస్తే తప్పకుండా మీరు భావోద్వేగానికి గురవడం ఖాయం. ఈ కాలంలో ఇంటికి ఒక టీవీ ఉంటుంది. కానీ గతంలో బాగా డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే టీవీలను కొనుక్కునేవారు.

అప్పట్లో టీవీ ఉన్న వాళ్ల ఇంటి బయట కూర్చుని కొద్దిసేపు టీవీ చూసి ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ టీవీలు ఉంటున్నాయి. అయితే ఈ వీడియోలో ఇద్దరు పిల్లలు ఎలక్ట్రానిక్ స్టోర్ బయట కూర్చొని టీవీ చూస్తు ఉండడం మనం వీడియోలో చూడవచ్చు. వీరిద్దరూ అనాథలా లేక మరోవరో అనే విషయం తెలియదు గానీ స్టోర్ రూమ్ బయట కూర్చున్న వీరి ధీన స్థితిని చూసి ప్రతి ఒక్కరి మనసు చలిచిపోతుంది.

ఈ పిల్లలు ఇద్దరు స్టోర్ రూమ్ బయట కూర్చుని టీవీలో వచ్చే కార్యక్రమాలను వీక్షించారు. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్క నెటిజన్ భావోద్వేగానికి గురవుతున్నారు. ”ఈ పిల్లల పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చిన్నప్పుడు మా పరిస్థితి కూడా ఇంతే” అని చాలామంది భావోద్వేగానికి గురవుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయా అని ఆశ్చర్య పోతున్నారు. ఈ వీడియోను బిహార్ న్యూస్ పేరుతో ఉన్న ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అది కాస్తా ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 20 వేలకు పైగా వ్యూస్ తో పాటు చాలానే లైక్స్ కూడా వచ్చాయి.

Share post:

Latest