వైరల్ అవుతున్న సమంత స్టైలిస్ట్ పోస్టులు.. స్లట్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య విడాకుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా,ఎక్కడ విన్నా ఈ వ్యవహారం గురించే మాట్లాడుకుంటున్నారు. క్యూట్ కపుల్ లా ఉండే ఈ జంట వెళ్లిపోతున్నారు అని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. అంతేకాకుండా ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అక్కినేని అభిమానులు ఊహించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు వార్తలు గానే మిగిలి పోతాయి అని అనుకున్నారు. ఇక ఆ వార్తలే నిజం చేస్తూ తమ బంధానికి స్వస్తి పలికారు నాగచైతన్య,సమంత.

అయితే వీరిద్దరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణం ఏమిటా అని అభిమానులు, సన్నిహితులు చాలామంది సోషల్ మీడియా కథల పై ఫోకస్ పెట్టారు. ఎవరి దగ్గర నుంచి అయినా చిన్న క్లూ దొరుకుతుందా అని సెర్చ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే అబద్ధాలు రహస్యాలు అనేవి అనుబంధాలను తుంచి వేస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న వాళ్లకు ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది అంటూ పోస్ట్ చేసి ఎన్ని నిమిషాల్లో ని డిలీట్ చేశారు. మరొకవైపు సమంతా కూడా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ సైతం డోంట్ జడ్జ్ ఎ బుక్ బై కవర్ అంటూ తన ఇంస్టా స్టోరీ లో పోస్ట్ చేసింది.