చావు దెబ్బలు తిన్న.. పవన్ రానా ఫోటోలు వైరల్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం.”భీమ్లా నాయక్”ఈ సినిమాని కే సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమా సీన్ లొకేషన్స్ లో ఒక ఫోటో వైరల్ గా మారుతుంది.

భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ అనే ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న పవన్ మరియు రానాలు ఒకరు మంచంపైన, మరొకరు ఎడ్ల బండి పైన సేదతీరుతూ కనిపించారు. అలాగే వీరిని గమనిస్తే వారి డ్రెస్సింగ్ లో ఇద్దరి నడుమ ఓ అదిరే యాక్షన్ సీన్ కంప్లీట్ చేసినట్లుగా మనకు అర్థమవుతోంది.ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్.ఎస్ థమన్ . ముఖ్యంగా ఈ సినిమాకి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నది మాత్రం త్రివిక్రమ్.

ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పవన్కళ్యాణ్ నుంచి ఒక యాక్షన్ సినిమా అని చూడబోతున్నామని మరికొంత మంది కామెంట్ చేస్తున్నారు.

Share post:

Latest