బిగ్ బాస్ లో 7 వారాలకు ప్రియ పారితోషికం?

బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా యాక్ట్రెస్ ప్రియ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె అభిమానులు ఏ విధంగా ఆమెను ఎలిమినేట్ చేస్తారు అంటూ ప్రశ్నలు వేశారు.ఇక బిగ్బాస్ హౌస్ నుంచి ప్రియ 7 వారాలకే తట్టాబుట్టా సర్దుకుని బయటకు వచ్చేసింది. ఇక ఆ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏడువారాలకు ప్రియా ఎంత పారితోషికాన్ని అందుకుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొందరు అయితే లక్షల్లోనే తీసుకుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అనుకుంటున్న దాని ప్రకారం చూసుకుంటే ప్రియా కు ఒక వారానికి 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రకారంగా చూసుకుంటే ప్రియా 7 వారాలకు దాదాపుగా 10 లక్షల పైనే సంపాదించినట్లు తెలుస్తోంది. ఈమె బుల్లితెరపై ప్రసారమయ్యే ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోనూ అలాగే సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకు ఇంత మొత్తాన్ని ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ఆమె చేసిన ఎంటర్ టైన్ మెంట్ ను బేస్ చేసుకుని ముందుగా అనుకున్న దాని కంటే మరింత ఎక్కువగా ఇచ్చే ఆస్కారం లేకపోలేదు.

Share post:

Latest