రవిని మళ్లీ జంతువులతో పోలిక.. నటరాజ్ మాస్టర్ పై నెటిజన్లు ఆగ్రహం?

నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ ను జంతుప్రదర్శనశాల గా మారుతున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక జంతువులతో పోలుస్తూ అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తున్నారు. ఒక్కొక్కడిని ఆయా జంతువుల తో పోలుస్తూ టార్చర్ పెడుతున్నాడు. మొదట హౌస్ లో గుంటనక్క ఉందని ప్రచారం చేసిన నటరాజ్ తాజాగా ఊసరవెల్లి కూడా ఉందని, సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ రెండు ఎవరో చెప్తాను అని అన్నాడు. ఇక రాను రాను నటరాజ్ మాస్టర్ పిల్లి, నెమలి, ఎలుగు బంటి ఇలా రకరకాల జంతువుల తో పోలుస్తున్నారు.

అయితే ఇటీవలే రవిని గుంటనక్క తో పోల్చిన నటరాజ్ మాస్టర్, నవీన్ ని మరొకసారి నత్తతో పోల్చాడు. అది కూడా లోబో దగ్గర. ఇక ఈ విషయానికి కాస్త లోబో వెళ్లి రవి కి చెప్పడంతో , నటరాజ్ మాస్టర్ పదేపదే తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అర్థం కావడంలేదని తల పట్టుకున్నాడు రవి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు నటరాజ్ మాస్టర్ పద్ధతి బాగోలేదని, ఒకసారి రెండుసార్లు అంటే పడతారు కానీ పదే పదే జంతువులతో పోల్చడం ఏంటి అని మాస్టర్ పై ఫైర్ అవుతున్నారు. నటరాజ్ మాస్టర్ ని జంతు శాస్త్ర పితామహుడు అని సెటైర్లు వేస్తున్నారు. ఈయనని జంతుప్రదర్శనశాలలు ఉంచాల్సింది బిగ్ బాస్ హౌస్ లో కాదు అని కామెంట్ చేస్తున్నారు.