నటరాజ్ మాస్టర్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏమిటంటే?

ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ 5 రన్ అవుతోంది. మొదట ఈ షోలోకి 19 మంది ఎంట్రీ ఇవ్వగా ఇప్పటికే 7 గురు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అయ్యారు. వారిలో నటరాజ్ మాస్టర్ కూడా ఒకరు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నటరాజ్ మాస్టర్ అంటే చాలా మందికి తెలియదు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత నటరాజ్ మాస్టర్ ని ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. అంతేకాకుండా ప్రేక్షకులు ఈ షో ద్వారా నటరాజ్ మాస్టర్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోగలిగారు. ఇక క్రేజ్ తో నటరాజ్ మాస్టర్ కు బాలకృష్ణ ఒక బంపర్ ఆఫర్ ను ఇచ్చాడు.

అదేమిటంటే నందమూరి బాలకృష్ణ ఇటీవలె మొదటిసారిగా డిజిటల్ తెరపై అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో సందడి చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ షో దీపావళి సందర్భంగా నవంబర్ 4న ఆహా లో ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో బాలయ్య స్టెప్పులు వేయనున్నారట, దీనికి నట్రాజ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో కూడా వైరల్ అవుతోంది. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే మరి.

Share post:

Latest