బిగ్ బాస్ లో నటరాజ్ మాస్టర్ పారితోషికం ఎంతో.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ జో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 19 మంది సెలబ్రిటీలతో మొదలైన ఈ షో చూస్తుండగానే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. అంతే కాకుండా నలుగురు హౌస్ మేట్స్ బయటకు కూడా వచ్చేశారు. మొదటివారం సరియు బయటికి రాగా, రెండోవారం ఉమాదేవి, మూడవ వారం లహరి, ఇప్పుడు తాజాగా 4వ వారం నటరాజ్ మాస్టర్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నందుకు ఒకవైపు నటరాజ్ మాస్టర్ కు బాధ గా ఉన్నప్పటికీ, మరొకవైపు గర్భవతిగా ఉన్న తన భార్య దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషంగా ఉన్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నాలుగు వారాలకు కలిపి నటరాజ్ మాస్టర్ కి ఎంత పారితోషికం అందింది అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం చూస్తే మాస్టర్ కు రోజుకు 15 వేల రూపాయలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారట, అంటే ఈ ప్రకారంగా చూసుకుంటే వారానికి లక్ష రూపాయలకు పైగా పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ షో లో నట్రాజ్ మాస్టర్ 4వారాలు ఉన్నాడు. అంటే నాలుగు లక్షల పైనే పారితోషికం అందుకున్నట్లు కనిపిస్తోంది.

Share post:

Latest