బిగ్ బాస్ : చరిత్రలో ఫస్ట్ టైమ్ బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్?

బుల్లితెరపై బిగ్ బాస్ షో రసవత్తరంగా సాగుతోంది. రోజు కొట్లాటలు, నవ్వులు, టాస్క్ లతో రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. ఇక ఇప్పటికే ఐదు వారాల నో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరోవారం లోకి అడుగు పెట్టింది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరి పై మరొకరు నిప్పులు చెరిగారు. దీనితో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ వాతావరణం మొత్తం మారిపోయింది. అయితే ఇప్పటికే కోపం మీద ఉన్న కంటెస్ట్ లను బిగ్ బాస్ కూల్ చేసే పనిలో పడినట్లు తాజా ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

అలాగే సన్నీ తన పంచులతో, శ్రీరామ్ ని ఇమిటేట్ చేస్తూ ఎప్పటిలాగే కుటుంబ సభ్యులు నవ్వించాడు. అలాగే హమీద ని ఇమిటేట్ చేసి చూపించేసరికి అందరు పెద్ద ఎత్తున నవ్వుకున్నారు. అలాగే మరొకవైపు కాజల్, శ్రీరాముల మధ్య నామినేషన్ ప్రక్రియ చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది.

తాజాగా జరిగిన నామినేషన్ కి బాగా హర్ట్ అయిన కాజల్.. శ్రీరామ్ నీ ఉద్దేశిస్తూ బ్రేకప్ బ్రో.. చరిత్రలో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రేకప్ ఫస్ట్ టైం కదా..అంటూ చెప్పుకొచ్చింది. ఇక షణ్ముఖ్, జెస్సి, సిరి ఎప్పటిలాగే ఇతర సభ్యుల పై పంచులు వేసి నవ్వించారు. ఇక తాజాగా ప్రోమో చూస్తే నామినేషన్ ప్రక్రియ ముగియగానే ఇంటి సభ్యులు అంతా మళ్ళీ ఒక్కటయ్యినట్లు తెలుస్తోంది.

Share post:

Popular