బాలకృష్ణ దగ్గర ఉండే లగ్జరీ కారు ఎన్ని కోట్లు అంటే..?

స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ టాక్ షోకు హోస్ట్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెండితెరపై సినిమాల ద్వారా ఎన్నో సంచలనాలు సృష్టించిన బాలకృష్ణ , స్మాల్ స్క్రీన్ పై అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.అయితే ఈ షో ప్రారంభ కార్యక్రమానికి బాలకృష్ణ లగ్జరీ కారులో వచ్చారు. ఖరీదైన బెంట్లీ కారులో బాలయ్య ఈ షో ఈవెంట్ కు రాగా బాలయ్య వచ్చిన లగ్జరీ కారు గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Balakrishna New Bentley Car Gifted By Nara Brahmani & Nandamuri Tejaswini -  YouTube

ఇక బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి ఈ కారును బాలయ్యకు బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం.ఈ కారు విలువ అక్షరాలా 4 కోట్ల రూపాయలు అని సమాచారం. అన్ స్టాపబుల్ టాక్ షో 12 ఎపిసోడ్లుగా ప్రసారం కానుందని తెలుస్తోంది.ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ టాక్ షోకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ కూడా జరిగిందని సమాచారం. బాలయ్య ఈ షో కోసం భారీస్థాయిలో అంటే ఒక్కో ఎపిసోడ్ కు 40 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఈ టాక్ షో దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది.