TJ రివ్యూ: `అస‌లేం జ‌రిగింది`

బ్యాన‌ర్‌: ఎక్స్‌ డోస్ మీడియా బ్యాన‌ర్‌
న‌టీన‌టులు: శ్రీరామ్‌, సంచిత‌,
మ్యూజిక్‌: ఏలేంద్ర మ‌హ‌వీర్‌
నిర్మాత‌లు: కింగ్ జాన్స‌న్ కొయ్యాడ‌, మైనేని నీలిమా చౌద‌రి
ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ (ఎన్‌వీఆర్‌)
రిలీజ్‌డేట్‌: 22 అక్టోబ‌ర్‌, 2021

ప‌రిచ‌యం:
తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూర్లో 1970 – 80 మ‌ధ్య‌కాలంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ప్రేమ క‌థ‌తో పాటు హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీగా ట్రైల‌ర్‌తోనే తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేసిన ఈ సినిమాలో కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శ్రీరామ్ హీరోగా న‌టించ‌గా.. కొత్త అమ్మాయి సంచిత హీరోయిన్‌గా న‌టించింది.. ప‌లు సినిమాల‌కు కెమేరామెన్‌గా ప‌నిచేసిన రాఘ‌వ ఈ సినిమాతో మెగాఫోన్ ప‌ట్టుకుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. గ‌త ఆరేళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్న ఎక్సోడ‌స్ మీడియా తొలిసారిగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాను నిర్మించింది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ‌:
అస‌లేం జ‌రిగింది అన్న టైటిల్‌తోనే ద‌ర్శ‌కుడు క‌థ‌పై ఎక్క‌డా లేని క్యూరియాసిటీ పెంచేశాడు. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప్రేమ క‌థ‌కు తోడుగా జాత‌కాలు, క‌న‌ప‌డ‌ని దుష్ట‌శ‌క్తుల నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ న‌డుస్తూ ఉంటుంది. హీరో ఊళ్లో ఉంటే ఏదో ఉప‌ద్ర‌వం ఉంద‌న్న పుకార్లు వ‌స్తుంటాయి. దీంతో హీరోపై ఎక్క‌డా లేని అనుమానాలు రేకెత్తుతూ ఉంటాయి. ఇక ప్ర‌తి అమావాస్య‌కు ఏదో తెలియ‌ని శ‌క్తి ఊల్లోకి ఎంట్రీ ఇస్తుంద‌ని.. అంద‌రూ స‌ర్వ‌నాశ‌నం అయిపోతారంటూ అతీత శ‌క్తుల గురించి తెలిసిన వ్య‌క్తి అంద‌రిని హెచ్చ‌రిస్తూ ఉంటాడు.

మ‌రో వైపు గ్రామ‌స్తులు చ‌నిపోతూ ఉంటారు. వీరు ఎందుకు చ‌నిపోతున్నారో ? స‌రైన కార‌ణం ఉండ‌దు. చివ‌ర‌కు వారు అంతా ఆ గ్రామం వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటారు. అదే స‌మ‌యంలో హీరోయిన్ సైతం అక్క‌డ నుంచి వెళ్లిపోదామ‌ని హీరోను వేడుకుంటుంది. కానీ న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం తాను ఎంత‌కైనా వెళ‌తానని.. తాను రాన‌ని హీరో శ్రీరామ్ చెపుతాడు. ఈ క్ర‌మంలోనే అమావాస్య రోజు ఎంట్రీ ఇచ్చిన మాంత్రికుడు ఎవ‌రు ? అత‌డికి హీరోయిన్‌కు ఉన్న లింక్ ఏంటి ? చివ‌ర‌కు హీరో శ్రీరామ్ అతీత శ‌క్తుల నుంచి ఆ ఊరితో పాటు హీరోయిన్‌ను ర‌క్షించాడా ? లేదా ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

TJ విశ్లేష‌ణ‌:
ఈ సినిమాను స‌బ్జెక్ట్ ప‌రంగా ఎక్క‌డ డీవియేట్ కాకుండా తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వ స‌క్సెస్ అయ్యారు. హ‌ర్ర‌ర్ ఎలిమెంట్స్‌కు తోటు అటు రొమాంటిక్ సీన్లు, పాట‌లు, యాక్ష‌న్ స‌న్నివేశాలు తెర‌కెక్కించిన తీరు అద్భుతం. ఇక సాంకేతికంగా ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. మ‌హ‌వీర్ పాట‌లు విన‌డానికి ఎంత బాగున్నాయో వాటిని తెర‌మీద ప్ర‌జెంట్ చేసిన తీరు కూడా అంతే బాగుంది. 5.1 స్పెష‌ల్ ఎఫెక్ట్ బాగున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ద‌ర్శ‌కుడు ప‌నిత‌నంతో పాటు న‌టీన‌టులు, టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ప్ర‌తి సీన్ ఎలివేట్ అయ్యేందుకు ప‌డిన తాప‌త్ర‌యం క‌నిపించింది. చిన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సేతు స్పెష‌ల్ ఎఫెక్ట్ కూడా ఈ హ‌ర్ర‌ర్ మూవీని ప్రేక్ష‌కుడు థియేట‌ర్లో ఎంజాయ్ చేసేలా చేశాయి.

ఇక ద‌ర్శ‌కుడె రాఘ‌వ ప్ర‌తి సీన్‌ను ఎంతో ఉత్కంఠ‌తో తెర‌కెక్కించాడు. ఒక్కో చోట ప్రేక్ష‌కుడు క‌నుచూపు తిప్పితే ఏం సీన్ మిస్ అవుతామో ? అన్నంత గ్రిప్పింగ్‌గా ఈ సినిమా ఉంది. ఇక తెలుగులో ఒక‌రికి ఒక‌రు, ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే, రోజాపూలు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన శ్రీరామ్ ఈ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. హీరోయిన్ సంచిత కొత్త అమ్మాయి అయినా ఎక్స్‌ప్రెష‌న్స్ విష‌యంలో అద్భుతంగా న‌టించింది. ఓవ‌రాల్‌గా ఈ సినిమా హారర్‌, థ్రిల్లర్‌ మూవీలను ఇష్టపడే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా చాలా బాగా న‌చ్చుతుంది.

TJ రేటింగ్‌: 3 / 5