నాగార్జున విడిచిపెట్టమని ఏఎన్ఆర్ టబు ని బ్రతిమలాడాడట?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని కుటుంబం గురించి అలాగే అక్కినేని కుటుంబ సభ్యుల గురించి మనందరికీ తెలిసిందే. మొదటగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరావు ఎన్నో భిన్న విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తన చివరి రోజులలో కూడా సినిమాలలో నటించాడు. ఇక నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.

నాగార్జున కూడా తన తండ్రి బాటలో పయనిస్తూ ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక అప్పట్లో నాగార్జున హీరోయిన్ టబు జంట కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కొన్ని సినిమాలలో జంటగా నటించి హిట్ పెయిర్ గా నిలిచారు. ఇక వీరిద్దరూ కలిసి వరుసగా సినిమాలో నటించడంతో వీరి మధ్య ఏదో ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ విధంగా అక్కినేని కుటుంబం గురించి అందరూ మాట్లాడటం తో చివరికి నాగేశ్వరావు వీరిద్దరి విషయంలో కలుగజేసుకుని వేగంగా టబు తో నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దయచేసి నా కొడుకు తో నీకు ఉన్నటువంటి స్నేహబంధాన్ని ఇక్కడితో వదిలేయ్.. నా కొడుకుని వదిలిపెట్టు అంటూ అప్పట్లో నాగేశ్వరావు బ్రతిమలాడారట.

Share post:

Popular