అందుకే జగన్ ను కలిసిన నాగార్జున..!!

అక్కినేని నాగార్జున ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాలలోను చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు సాధారణంగా పోయిన ఏడాది చిరంజీవితో కలిసి నాగార్జున వైయస్ జగన్ ను కలిసిన విషయం తెలిసిందే.. అయితే వీరు భేటీ అయినప్పుడు సినిమా ఇండస్ట్రీ లో జరుగుతున్న నష్టాల గురించి వైయస్ జగన్ కు వినిపించారు.. కానీ ఈ సారి మాత్రం చిరంజీవి రాకుండా కేవలం నాగార్జున మాత్రమే వైయస్ జగన్ ను కలవడానికి రావడంతో, ప్రతి ఒక్కరిలోనూ వివిధ రకాల అనుమానాలు మొదలవుతున్నాయి..

అయితే తాజాగా వైయస్ జగన్ ను భేటీ అయిన నాగార్జున లంచ్ కూడా ఆయనతో కలిసి పూర్తి చేయడం గమనార్హం.. ఇక మీడియాకు ఎదురుపడిన నాగార్జునను.. మీడియా సోదరులు ఎందుకు ఈ రోజు జగన్ ను కలిశారు అని అడగగా.. నాగార్జున సమాధానంగా.. వైయస్ జగన్ నా శ్రేయోభిలాషి.. జగన్ ను కలిసి చాలా రోజులైంది.. ఒకసారి కలవాలి అనిపించింది అందుకే ఈరోజు కలవడం జరిగింది అంటూ తెలిపాడు.. మీడియా సోదరులు మీరు భేటీ అయిన సమయంలో ఏం చర్చించుకున్నారు అని అడగగా.. చిన్న నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాగార్జున..

నాగార్జున , జగన్ తో ఏ విషయాలపై చర్చించాడు.. కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే కలిసాడా.. లేక సినీ ఇండస్ట్రీలో టికెట్లు ఆన్ లైన్ టికెటింగ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేసుకుంటూ ఉండగా , హీరోలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఈ విషయంపై ఏమైనా చర్చించారా అనే వివిధ రకాల కోణాల్లో చర్చలు మొదలవుతున్నాయి..

Share post:

Popular