ఏలియన్ లా మారిపోయిన శృతిహాసన్.. కారణం..?

నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ , ఈ మధ్యకాలంలో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్రాక్ సినిమాతో వచ్చిన ఈ ముద్దుగుమ్మ వకీల్ సాబ్ వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది..ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆయన సలార్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.. తన పాత్ర ను హైలెట్ చేసే సినిమాలు పెద్ద పెద్ద సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

లుక్స్ పరంగా మాత్రం ప్రేక్షకులను మరింతగా నిరుత్సాహ పరిచే విధంగా ఉందని చెప్పాలి.. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు శృతిహాసన్ మరింతగా బక్కచిక్కి పోయింది.. క్రాక్ , వకీల్ సాబ్ వంటి సినిమాల్లో ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు.. నటన, డాన్స్ ల విషయంలో ఆమె ఏమాత్రం తగ్గలేదు.. కానీ లుక్ ను చూస్తే మాత్రం ప్రేక్షకులు భయపడేలా ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.. తాజాగా ఈమె అప్లోడ్ చేసిన ఒక వీడియో చూసి నెటిజన్లు అందరూ షాక్ అవ్వడమే కాకుండా మీ ఆరోగ్యం బాగానే ఉంది కదా అని అనుమానాలు రేకెత్తించే విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏలియన్ లో మారిపోయిన శృతిహాసన్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

 

Share post:

Popular