యాడ్స్ వల్ల అభిమానుల చేతిలో అవమానం పాలయిన స్టార్ హీరోలు..?

ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోలు అలాగే హీరోయిన్లు కూడా సినిమాలలో బాగా పాపులారిటీని అందుకున్న తర్వాత పలు వాణిజ్య ప్రకటనలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ని మొదులుకొని.. నేటి తరం కుర్ర హీరోల వరకు ప్రతి ఒక్కరూ వాణిజ్య ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వీరు చేసే ప్రకటనల వల్ల అభిమానుల చేతుల్లో ట్రోలింగ్ కూడా గురవుతున్నారు. అయితే యాడ్స్ ద్వారా అభిమానుల చేతిలో అవమానం పాలయిన స్టార్ హీరో, హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

10TV Telugu News

1. అల్లు అర్జున్:
అల్లు అర్జున్ తాజాగా శ్రీచైతన్య విద్యాసంస్థల ని ప్రమోట్ చేయడంలో ఒక యాడ్ చేశాడు. ఈ సంస్థ యొక్క పాత విద్యార్థులు చదువు పేరుతో ఒత్తిడికి గురిచేసే అలాంటి సంస్థలను మీరు ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ అల్లు అర్జున్ ను ప్రశ్నిస్తున్నారు.

2. మహేష్ బాబు:
మహేష్ బాబు పాన్ బహార్ యాడ్ చేశారు. కానీ ఇందులో అన్ని మసాలాలు ఉన్నాయని, దీనివల్ల హెల్త్ పాడవుతుందని తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నారు అంటూ మహేష్ బాబు పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు.

3. రష్మిక మందన్న:
ఇటీవల ఒక అండర్వేర్ కంపెనీని ప్రమోట్ చేయడం లో ..యాడ్ లో హీరో ఎక్సర్సైజ్ చేస్తుంటే అండర్వేర్ కనిపిస్తుంది. దీంతో రష్మిక అలాగే ఆ అండర్వేర్ వైపు చూస్తూ ఉంటుంది.ఆడవాళ్లు అలా చూస్తారా? అసలు ఆ యాడ్ ఎలా ఒప్పుకున్నావు? డబ్బుల కోసం ఇలాంటి యాడ్ చేస్తావా అంటూ రష్మికని ట్రోల్ చేశారు.

4. రెజీనా:
సిగ్నేచర్ అనే ఆల్కహాల్ ని ప్రమోట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలీదా? ప్రజలకి హాని కలిగించే వస్తువుని ఎలా ప్రమోట్ చేస్తావు అంటూ రెజీనాని ట్రోల్ చేస్తున్నారు.

Share post:

Latest