ఆచార్య సినిమా నుంచి.. పూజ హెగ్డే ఫస్ట్ లుక్..?

చిరంజీవి హీరోగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇప్పటివరకు డైరెక్టర్ కొరటాల శివకు ఓటమి అంటే ఎరుగని డైరెక్టర్ గా పేరు పొందాడు. ఇక మొదటి సారి చిరంజీవి తన కుమారుడితో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై న భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కొణిదెల బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని మెగా అభిమానులే కాకుండా ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తూ ఉండగా.. రామ్ చరణ్ సరసన పూజా అయితే నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ రోజున పూజ హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా పూజకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో పూజా హెగ్డే నీలాంబరి పాత్రలో నటించనుంది. ఇక చిత్ర యూనిట్ సభ్యులు చేసిన ఫస్ట్ విషయానికి వస్తే ఇందులో పూజ హెగ్డే లంగావోని హ తెలుగు అమ్మాయిల కనిపిస్తోంది. పూజ ని ఇలా చూసిన ఆమె అభిమానులు ఎంతో నాజూకు గా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest